బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది ఈ సినిమా… రెండో రోజులో అడుగు పెట్టిన సినిమాకి సింహాద్రి రీ రిలీజ్ వలన కొంచం ఇబ్బందులు ఎదురు అయినా కూడా ఉన్నంతలో….
మరో సారి మంచి హోల్డ్ ని చూపించి ఇప్పుడు మరోసారి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే దిశగా వెళుతూ ఉండటం విశేషం, ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే 40% రేంజ్ లో డ్రాప్ అవ్వగా ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి చూస్తూ ఉంటె పోటి ఉన్నప్పటికీ కూడా…
1.2 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 1.5 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని సాధించవచ్చు. సినిమా కనుక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మొదటి రోజు లెవల్ లో..
అంచనాలను మించి 1.6 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే సినిమా వీకెండ్ లో సూపర్బ్ హోల్డ్ ని చూపించవచ్చు. ఇక తమిళనాడులో మరోసారి పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ మరోసారి తెలుగులోనే సినిమా ఎక్కువ జోరు చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….