Home న్యూస్ 45L తో 16.5 కొట్టిన హీరో….లవ్ గురు కలెక్షన్స్ పరిస్థితి మాత్రం ఇదే!

45L తో 16.5 కొట్టిన హీరో….లవ్ గురు కలెక్షన్స్ పరిస్థితి మాత్రం ఇదే!

0

2016 టైంలో జస్ట్ 45 లక్షల రేంజ్ బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టోటల్ రన్ లో 16.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది విజయ్ ఆంటోని(Vijay Antony) బిచ్చగాడు(Bichagadu Movies) సినిమా… ఆ సినిమా అల్టిమేట్ హిట్ తో విజయ్ అంటోనికి తెలుగులో మార్కెట్ ఏర్పడింది…

కానీ పెద్దగా సినిమాలు ఏవి వర్కౌట్ అవ్వలేదు…మళ్ళీ బిచ్చగాడు2 సినిమాతో తెలుగులో సక్సెస్ ను అందుకున్న విజయ్ ఆంటోని ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు లవ్ గురు(Love Guru Movie Collections Report) తో రీసెంట్ గా రాగా తెలుగు లో ఏమాత్రం ఇంపాక్ట్ ను కూడా ఈ సినిమా చూపించ లేక పోయింది…

ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో చేయక పోవడం, టాలీవుడ్ లో ప్రజెంట్ అన్ సీజన్ ఇంపాక్ట్ వలన జనాలు ఈ సినిమాను ఏమాత్రం పట్టించుకోలేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందని అంచనా…

అదే టైంలో తమిళ్ లో మాత్రం ఈ సినిమా 14.50 కోట్ల దాకా గ్రాస్ ను వసూల్ చేయగా టోటల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల లోపు గ్రాస్ ను 8 కోట్లకు పైగా షేర్ ని సాధించింది ఈ సినిమా…..

బిచ్చగాడు2 సినిమా టోటల్ రన్ లో 39 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఆ సినిమాతో పోల్చితే లవ్ గురు సినిమా ఎంటర్ టైన్ మెంట్ డీసెంట్ గానే ఉన్నప్పటికీ కూడా ఎందుకనో ఆడియన్స్ ను థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో అయితే రప్పించ లేక పోయింది అనే చెప్పాలి… తమిళ్ లో మాత్రం సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here