Home న్యూస్ 2nd డే బ్రహ్మాస్త్ర కలెక్షన్స్…ఈ రోజు కూడా రికార్డుల జాతరే!

2nd డే బ్రహ్మాస్త్ర కలెక్షన్స్…ఈ రోజు కూడా రికార్డుల జాతరే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర మొదటి రోజు నాన్ హాలిడే బిగ్గెస్ట్ బాలీవుడ్ ఓపెనర్ గా నిలవగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ మూవీగా నిలిచి రికార్డ్ సృష్టించగా వాల్యూ బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చింది. ఇక రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…..

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల రేంజ్ నుండి 4 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా షేర్ పరంగా అటూ ఇటూగా 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక అన్ని చోట్లా రిపోర్ట్స్ ని బట్టి కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక హిందీ లో ఈ రోజు 15% రేంజ్ లో గ్రోత్ ని మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు సొంతం చేసుకోవడంతో ఈరోజు సినిమా హిందీ లో 36 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు… టోటల్ ఇండియా లో ఈ రోజు సినిమా 42 కోట్ల నుండి 45 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అంటే సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజు కి మించి రెండో రోజు గ్రోత్ ని చూపించబోతుంది అని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద మిక్సుడ్ టాక్ తో కూడా…

ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా ఈ మిక్సుడ్ టాక్ తో బాయికాట్ ట్రెండ్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో రోజు మాస్ రాంపేజ్ ను చూపిస్తున్న సినిమా వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపే చాన్స్ ఉంది. ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here