బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా రెండో రోజులో ఎంటర్ అయ్యి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 35-40% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా తిరిగి ఈవినింగ్ షోల నుండి మంచి జోరుని చూపిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొత్తం మీద…
మాస్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా ఏ సెంటర్స్ లో అవతార్ 2 జోరు చూపిస్తుంది. దాంతో అక్కడ కొంచం డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా రెండో రోజు ధమాకా సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు.
మొత్తం మీద ఇప్పుడు రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా ముందు అనుకున్నట్లే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే 3.2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రెండో రోజు 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రెండో రోజు రవితేజ మాస్ జాతర చూపిస్తున్నాడు. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.