భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie 2nd Day Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఎలాగోలా నేషనల్ హాలిడే హెల్ప్ వలన పర్వాలేదు అనిపించేలా…
ఓపెనింగ్స్ ను అందుకుంది కానీ సినిమా హైప్ అండ్ క్రేజ్ దృశ్యా కచ్చితంగా మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకుని ఉండాల్సింది కానీ అలా జరగలేదు….మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా రెండో రోజు శుక్రవారం అయినా కూడా…
వర్కింగ్ డే అవ్వడంతో డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే సొంతం చేసుకున్న సినిమా 60-65% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి ఇప్పుడు….దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల దాకా షేర్ ని సాధించవచ్చు కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సాలిడ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
2-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సరిపోవు కానీ అసలు వీకెండ్ 3వ రోజు నుండి మొదలు కానుంది కాబట్టి ఏమైనా గ్రోత్ ఉంటుందో చూడాలి. ఇక మొత్తం మీద సినిమా 2 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.