Home న్యూస్ 2nd డే 3 మూవీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఏ సినిమా ఎలా హోల్డ్ చేసిందంటే!!

2nd డే 3 మూవీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఏ సినిమా ఎలా హోల్డ్ చేసిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie), గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మరియు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమాలు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా వేటి రేంజ్ లో అవి పర్వాలేదు అనిపించగా ఉన్నంతలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మంచి జోరుని చూపించింది.

ఇక రెండు రోజులో అడుగు పెట్టిన మూడు సినిమాలు ఈ రోజు డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకున్నాయి. గం గం గణేశ సినిమా మూడు సినిమాల్లో ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు టాక్ బాగున్నా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను అందుకోలేక పోయిన భజే వాయు వేగం మూవీ రెండో రోజు మాత్రం కొంచం జోరు పెంచింది.

ఇక మొదటి రోజు అంచనాలను మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఇప్పుడు రెండో రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా టాక్ దృశ్యా బాగానే హోల్డ్ చేసింది. ఓవరాల్ గా గం గం గణేశ సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 40-45 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

భజే వాయు వేగం సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 55-60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.7-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఈ మూడు సినిమా 2 రోజులకు గాను సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here