Home గాసిప్స్ కన్నడ గడ్డ మీద ఎన్టీఆర్ క్రేజ్…దేవరకి బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందంటే!!

కన్నడ గడ్డ మీద ఎన్టీఆర్ క్రేజ్…దేవరకి బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందంటే!!

0

సోలో హీరోగా సినిమా వచ్చి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…

త్వరలో రిలీజ్ కానున్న ఈ సెన్సేషనల్ మూవీ మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలను మించిపోయే రేంజ్ లో సినిమా ఉంటుంది అన్న నమ్మకంతో ఉన్నారు అందరూ…ఇక రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండగానే బిజినెస్ పరంగా ఇటు తెలుగు రాష్ట్రాలలో అలాగే మిగిలిన చోట్ల కూడా…

సినిమాకి సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా కి కర్ణాటక గడ్డ నుండి సాలిడ్ బిజినెస్ ఆఫర్ వచ్చిందని సమాచారం. అక్కడ ఈ సినిమా రిలీజ్ టైంలో మరో పాన్ ఇండియా మూవీ మార్టిన్ నుండి పోటి ఉన్నా కూడా దేవర సినిమా పార్ట్ 1 కి ఆల్ మోస్ట్ 16 కోట్ల బిజినెస్ ఆఫర్ సొంతం అయ్యిందట….

అడ్వాన్స్ బేస్ మీద ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా ఇది ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ఆఫర్ అని చెప్పాలి. మిగిలిన హీరోలు పాన్ ఇండియా మూవీస్ ని వరుసగా చేస్తూ అక్కడ సాలిడ్ బిజినెస్ లను అందుకుంటూ ఉండగా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కూడా ఇప్పుడు…

తన రేంజ్ ని చూపెడుతూ ఎక్స్ లెంట్ బిజినెస్ ఆఫర్స్ ను దేవర సినిమాతో సొంతం చేసుకుంటున్నాడు. రేటు ఇంకా ఫైనల్ కాలేదు కానీ మేకర్స్ కొంచం 18 కోట్లకు పైగా రేటు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. రిలీజ్ కి ఇంకా టైం ఉండటంతో ఆ టైం కి ఆ రేటు వస్తే ఓకే లేదంటే ఈ రేటుని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here