మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మొదటి రోజు కేవలం 2.91 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా నుండి కూడా పోటిని ఎదురుకుంటూ ఉండగా క్లాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపిస్తున్నా కూడా…
మాస్ సెంటర్స్ లో ఆంధ్రలో మేజర్ ఏ సెంటర్స్ మినహా మిగిలిన అన్ని చోట్లా డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. మొదటి రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 30-40% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లో కూడా…
ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.8-2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.8 కోట్ల రేంజ్ నుండి 3 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా జానర్ దృశ్యా ఇవి మంచి హోల్డ్ అనే చెప్పాలి కానీ సినిమా సాధించిన బిజినెస్ దృశ్యా ఇంకా ఎక్కువ వసూళ్లు అవసరం…ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Maccha Yash movie release ayindira
Yash movie poster maccha😂😂