ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ నుండి ఒక సినిమా టాలీవుడ్ నుండి ఒక సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్(Jawan) హవా ముందు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ మూవీ Miss శెట్టి Mr పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) పోటిని తట్టుకోలేక పోయింది..
ఆ ఇంపాక్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించగా రెండో రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా నార్మల్ డే అయినా కూడా మంచి హోల్డ్ తో సాలిడ్ ట్రెండ్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే…
అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక జవాన్ మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా ఈ రోజు సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉంది.
ఇక సినిమా హిందీ లో నార్మల్ డే అయినా కూడా ఓ రేంజ్ లో ఊచకోత కోస్తూ ఉండగా ఈ రోజు సినిమా హిందీ లో అవలీలగా 45 కోట్లకి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు…
డే2 నార్మల్ డే లో ఇలాంటి కలెక్షన్స్ అంటే ఊచకోత అనే చెప్పాలి. Miss శెట్టి Mr పొలిశెట్టి సోలో రిలీజ్ ఉండి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది కానీ పాజిటివ్ టాక్ బాగానే ఉండటంతో సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక 2 సినిమాల 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.