Home న్యూస్ 1st డే 4.94….2nd డే 4.06…కుమ్ముతున్నాడు మంచు విష్ణు!!

1st డే 4.94….2nd డే 4.06…కుమ్ముతున్నాడు మంచు విష్ణు!!

0

చాలా టైంగా హిట్ కి దూరంగా ఉన్న హీరోలలో ఒకరైన మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అయిన కన్నప్ప(Kannappa Movie Teaser) ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతూ ఉండగా ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో మమ్మోత్ బడ్జెట్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న మంచు విష్ణు, ఈ సినిమాతో తన కెరీర్ లోనే…

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాను అన్న నమ్మకంతో ఉండగా ఇతర ఇండస్ట్రీల నుండి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తూ ఉండటంతో అంచనాలు అయితే బాగానే ఉండగా రీసెంట్ గా సినిమా నుండి రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్ ఓవరాల్ గా బాగానే ఉంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి అయితే సొంతం చేసుకుంది…

   

దైవభక్తి సినిమానే అయినా చాలావరకు టీసర్ ఒక వారియర్ మూవీని పోలినట్లు అనిపించి టీసర్ ఎండ్ లో డివోషినల్ గా ఎండ్ అయ్యింది. ఇక టీసర్ కి యూట్యూబ్ లో మొదటి 24 గంటల్లో 4.94 మిలియన్స్ వ్యూస్ సొంతం అయ్యి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా రెండో రోజు కూడా ఈ టీసర్ మంచి హోల్డ్ నే చూపించి జోరు చూపించింది.

ఆల్ మోస్ట్ 4.06 మిలియన్ వ్యూస్ ను రెండో రోజున సొంతం చేసుకున్న కన్నప్ప టీసర్ మంచు విష్ణు కెరీర్ లో టీసర్ ల పరంగా బెస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం, ఓవరాల్ గా ఇతర ఇండస్ట్రీల స్టార్స్ తో పాటు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కూడా సినిమాలో ఉండటం ఈ సినిమా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్…

ఆ అడ్వాంటేజ్ వలెనే ఇప్పుడు టీసర్ కి ఓవరాల్ గా మంచి రీచ్ సొంతం అవుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా దుమ్ము లేపే ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ట్రైలర్ బాగా క్లిక్ అయితే సినిమా ఓపెనింగ్స్ కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here