Home న్యూస్ 2nd డే మత్తు వదలరా2 కలెక్షన్స్…ఈ రోజు మాస్ రచ్చ!!

2nd డే మత్తు వదలరా2 కలెక్షన్స్…ఈ రోజు మాస్ రచ్చ!!

0

ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం, సినిమా తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా…

ఓవర్సీస్ లో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఇక రెండో రోజు సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో గంట గంటకి టికెట్ సేల్స్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా… ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా…

అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది ఇప్పుడు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో 2.2-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…

ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ ని అందుకోవడానికి పరుగులు పెడుతూ ఉండగా…

వీకెండ్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా రెండో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మొదటి రోజు లెవల్ లో ఉంటే ఈ అంచనాలను మించే అవకాశం కూడా ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here