మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది.
ఇక రెండో రోజులో ఎంటర్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మొదటి రోజుతో పోల్చితే డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా మాస్ అండ్ క్లాస్ సెంటర్స్ అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
ఇటు నైజాం కానీ అటు సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో కూడా చాలా షోలు హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం కాగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 5-5.2 కోట్ల రేంజ్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించిపొతే ఈ లెక్క 5.5-6 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం మించిపోయే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా…
మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో సినిమా వరల్డ్ వైడ్ గా 2వ రోజున 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు అన్నీ అనుకున్నట్లు జరిగితే మరోసారి నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది…ఇక టోటల్ గా 2 రోజుల సినిమా కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.