Home న్యూస్ 2nd డే స్కంద కలెక్షన్స్…..రామ్ మాస్ జోరు….కానీ!!

2nd డే స్కంద కలెక్షన్స్…..రామ్ మాస్ జోరు….కానీ!!

0

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

మొదటి రోజు 10.57 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మాస్ సెంటర్స్ లో కొంచం జోరు చూపించినా కూడా ఓవరాల్ గా ఇప్పుడు రెండో రోజున…

తెలుగు రాష్ట్రాల్లో 3.8 కోట్ల రేంజ్ లో అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.5 కోట్ల నుండి 4.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…

అది కూడా మొదటి రోజు లానే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల మీదే డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా రెండో రోజు మాస్ జోరునే చూపించినా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక 2 రోజులకు గాను సినిమా ఏరియాల వారిగా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here