ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటూ ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) ఈ సమ్మర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో ఇప్పుడిప్పుడే అంచనాలు అయితే మెల్లి మెల్లిగా పెరుగుతూ ఉండగా..
రీసెంట్ గా సినిమా నుండి రెండో సాంగ్ ను రిలీజ్ చేయగా కొల్లగొట్టినాదిరో అంటూ ఫోల్క్ లిరిక్ తో వచ్చిన ఈ సాంగ్ కి రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేదు కానీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం విన్నప్పుడే మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లో..
రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా మొదట్లో వ్యూస్ అండ్ లైక్స్ చాలా తక్కువగా ఉండటంతో 24 గంటల రెస్పాన్స్ కొంత నిరాశ కలిగించే రేంజ్ లో ఉంటుందేమో అన్న అనుమానాలు రేకేత్తినా కూడా ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయిన తర్వాత మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…
ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి సినిమా 11.52 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా మంచి జోరు ని చూపించగా లైక్స్ విషయంలో మాత్రం కొంత వెనకడుగు వేసినట్లు అనిపించినా ఓవరాల్ గా 24 గంటల్లో 164.9K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా డీసెంట్ టు గుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని 24 గంటల్లో ఈ సాంగ్ ఉన్నంతలో మంచి జోరునే చూపించింది అని చెప్పాలి… మొత్తం మీద సినిమా మీద మెల్లిమెల్లిగా బజ్ పెరుగుతూ ఉండటంతో ట్రైలర్ ఒక్కటి అనుకున్న రేంజ్ లో క్లిక్ అయితే ఇక పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ లో తన సత్తా చాటే అవకాశం ఉంటుంది.