Home న్యూస్ భారతీయుడు2….ఈ రెండు ఓ రేంజ్ లో కుమ్మేశాయి…ఇక దానికోసం వెయిటింగ్!

భారతీయుడు2….ఈ రెండు ఓ రేంజ్ లో కుమ్మేశాయి…ఇక దానికోసం వెయిటింగ్!

0

ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Shankar) డైరెక్షన్ లో వచ్చిన వన్ ఆఫ్ బెస్ట్ మూవీస్ లో ఒకటైన భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కించిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా ఎప్పటి నుండో షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలు ఉండగా ఒక దశలో డబ్బులు లేక సినిమానే ఆపేశారు…

కానీ కమల్ హాసన్(Kamal Haasan) నటించిన విక్రమ్(Vikram Movie) ఎపిక్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తిరిగి ఈ సినిమా పట్టాలు ఎక్కగా ఇప్పుడు అన్ని పనులను పూర్తి చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది ఈ సినిమా…పార్ట్ 2 తో పాటు పార్ట్ 3 కూడా ఉండబోతున్న ఈ సినిమా నుండి మొదటగా ఆడియోని రీసెంట్ గా రిలీజ్ చేశారు…

సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న అనిరుద్ అందించిన మ్యూజిక్ భారతీయుడు పార్ట్ 1 రేంజ్ లో రచ్చ లేపుతాయో లేవో అన్న డౌట్స్ నడుమ రిలీజ్ అయిన సాంగ్స్ కి రెస్పాన్స్ మాత్రం పర్వాలేదు అనిపించే రేంజ్ లోనే ఉంది, కానీ విజువల్స్ మెప్పిస్తే సాంగ్స్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉండగా… ఓవరాల్ గా రిలీజ్ అయిన ఆడియోలో…

శౌరా సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఆ సాంగ్ ను మించి కంబ్యాక్ ఇండియన్ సాంగ్ ఇప్పుడు భారీ పాపులారిటీని దక్కించుకుని ఇన్ స్టంట్ గా హిట్ అయింది. ఈ రెండు పాటలు ఓవరాల్ గా ఆడియోలో మెయిన్ హైలెట్ గా నిలిచాయి కానీ ఓవరాల్ గా ఆడియో భారతీయుడు రేంజ్ లో అయితే లేదని చెప్పొచ్చు…

ఈ రెండు పాటలతో కొంత హైప్ అయితే సినిమా మీద పెరగగా ఇప్పుడు అందరూ సినిమా నుండి వచ్చే ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు… ఓవరాల్ గా భారతీయుడు లాంటి ఎపిక్ మూవీకి సీక్వెల్ అంటే ఉండాల్సిన హైప్ కి ప్రస్తుతం బజ్ తక్కువగానే ఉండగా ట్రైలర్ క్లిక్ అయితే మాత్రం ఆటోమాటిక్ గా హైప్ పెరిగిపోవడం ఖాయం.. ఈ నెల లోనే సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here