మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు క్రాక్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు కానీ రీసెంట్ మూవీస్ ఏ రేంజ్ లో నిరాశ పరిచాయో అందరికీ తెలిసిందే. వాటిలో 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కోరాజా సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మరీ నెగటివ్ టాక్ ని ఏమీ తెచ్చుకోలేదు కానీ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం…
తీవ్రంగా నిరాశ పరిచింది, దానికి ప్రధాన కారణం రవితేజ ఫామ్ లో లేకపోవడం అండ్ ఆ టైం లో సంక్రాంతి మూవీస్ వీర విహారం చేస్తూ ఉండటంతో ఈ సినిమాకి భారీ ఎఫెక్ట్ గా మారింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెలేక పోయిన ఈ సినిమా డిసాస్టర్ గా పరుగును ముగించింది.
కాగా సినిమా కాన్సెప్ట్ దృశ్యా సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని జెమిన్ టీవీ వాళ్ళు 6 కోట్ల రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. అందులో శాటిలైట్ రైట్స్ కింద 3.2 కోట్ల రేటు పలికిందని సమాచారం. సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ సినిమాను టెలివిజన్ లో…
టెలికాస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకున్న తర్వాత ఈ సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా లేట్ టెలికాస్ట్ అయినా కానీ సినిమా మంచి రేటింగ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 5.83 టి ఆర్ పి రేటింగ్ ను సొంతం చేసుకుంది ఫస్ట్ టెలికాస్ట్ లో. ఓవరాల్ గా రేటు ప్రకారం చూసుకుంటే ఇది యావరేజ్ రేటింగ్ అనే చెప్పాలి.
కానీ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కి అలాగే జెమినీ టీవీ చేసిన లేట్ టెలికాస్ట్ దృశ్యా చూసుకుంటే మట్టుకు సాలిడ్ రేటింగ్ ని సినిమా మొదటి టెలికాస్ట్ లో సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక త్వరలో క్రాక్ కూడా టెలివిజన్ లో టెలికాస్ట్ కానుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో రేటింగ్ ని సొంతం చేసుకుంటుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.