స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పోషించిన డిఫెరెంట్ రోల్స్ లో దువ్వాడ జగన్నాథం సినిమా కూడా ఒకటి… భారీ హైప్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకునే టాక్ సొంతం చేసుకోకున్నా కానీ ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేయగా లాంగ్ రన్ లో 70 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. ఇక టెలివిజన్ లో కూడా సాలిడ్ టి.ఆర్.పి రేటింగ్స్ తో దుమ్ము లేపింది…
ఇక తెలుగు కి మించి హిందీ లో డబ్ అయ్యి అక్కడ రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి తర్వాత హిందీ టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యి అక్కడ రఫ్ఫాడించింది. దాదాపు ఇండియా లో డైరెక్ట్ గానే డబ్ వర్షన్ తోనే…
ఈ సినిమాను చూడని వారు లేరు…. అలాంటి ఈ సినిమా ను ఇప్పుడు అఫీషియల్ గా హిందీ లో రీమేక్ చేస్తున్నారు… రేసులో ముగ్గురు హీరోలు కూడా సిద్ధంగా ఉండగా త్వరలో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వడం సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం.
రేసులో ఎక్కువ అవకాశం సిద్దార్థ్ మల్హోత్రా కి ఉండగా తర్వాత కార్తిక్ ఆర్యన్ ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ కూడా ఈ రీమేక్ లిస్టులో ఉన్నారని సమాచారం. త్వరలోనే ముగ్గురి లో ఒకరు ఫైనల్ అవుతారని చెబుతున్నారు కానీ ఆల్ మోస్ట్ సిద్దార్థ్ కన్ఫాం అయినట్లే అని అంటున్నారు.. కానీ తన మార్కెట్ మిగిలిన ఇద్దరు హీరోలతో పోల్చితే…
చాలా తగ్గడంతో ఫైనల్ స్టేజ్ ఆలోచనలో ఉన్నారట… ఆల్ రెడీ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నా మళ్ళీ రీమేక్ కి సిద్ధం చేస్తుండటం విశేషం అనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇది వరకు కూడా ఇలా రీమేక్స్ జరగగా స్టొరీ పాయింట్ ని టోటల్ గా మార్చేసి డిఫెరెంట్ గా తీసే ప్రయత్నం చేస్తారు. వర్కౌట్ అయితే హిట్ అవుతుంది లేదా మరో ఫ్లాఫ్ గా మిగులుతుంది. ఈ సినిమా ఎ కేటగిరిలో చేరుతుందో చూడాలి..