బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ దక్కినా కానీ ఆడియన్స్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే థియేటర్స్ కి రాలేదు, మొత్తం మీద మూడో రోజు మాత్రం కొంచం అంచనాలను మించి…
కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకున్న కొండ పొలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో భారీ ట్రెండ్ ని చూపెట్టి మొత్తం మీద 3 వ రోజు 77 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోవడం…
విశేషం అనే చెప్పాలి… దాంతో మూడో రోజు కుమ్మడం కొంచం సినిమా కి కలిసి వచ్చే అంశమే అయినా అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉండటం తో సినిమా ఆ మార్క్ ని ఎంతవరకు అందుకుంటుంది అన్నది మాత్రం డౌట్ లో పడింది అనే చెప్పాలి… ఓవరాల్ గా వీకెండ్ సినిమా టోటల్ కలెక్షన్స్…
లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 72L
👉Ceeded: 29L
👉UA: 52L
👉East: 27L
👉West: 21L
👉Guntur: 32L
👉Krishna: 22L
👉Nellore: 16L
AP-TG Total:- 2.71CR(4.11CR~ Gross)
Ka+ROI: 10L
OS – 14L
Total WW: 2.95CR(4.75CR~ Gross)
ఇదీ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 7.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా మొత్తం మీద 8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.05 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా రెట్టించిన జోరు తో హోల్డ్ చేస్తేనే లాస్ ని కవర్ చేసే అవకాశం ఉంటుంది…