బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో డబ్బింగ్ మూవీ కురుప్ పై పెద్దగా అంచనాలు లేవు, పబ్లిసిటీ కూడా మరీ భారీగా ఏమి చేయలేదు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు నుండే సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది… మొదటి రోజు స్ట్రైట్ మూవీస్ కన్నా కూడా….
బెటర్ ఆక్యుపెన్సీ తో రన్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించింది, ఇక ఇప్పుడు మూడో రోజు ఆదివారం అయినా కానీ వర్షాలు నైట్ షోలకు ఇబ్బంది కొన్ని చోట్లా పెట్టినా కానీ సినిమా…
సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేయడమే కాదు రెండో రోజు కన్నా కూడా మూడో రోజు కలెక్షన్స్ పరంగా ఎక్కువ వసూళ్ళ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. మొదటి రోజు 38 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు…
40 లక్షల దాకా షేర్ ని సాధించింది. ఇక మూడో రోజు సినిమా 43 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా టోటల్ గా మూడు రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.21 కోట్ల షేర్ ని అలాగే 2.25 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇందులో కోటి దాకా గ్రాస్ కలెక్షన్స్ ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం అవ్వగా అక్కడే షేర్…
ఆల్ మోస్ట్ 62 లక్షల దాకా సొంతం అయ్యిది. సినిమాను తెలుగు లో ఓన్ రిలీజ్ కాకుండా 60 లక్షల రేటు కి అమ్మగా 80 లక్షల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని 41 లక్షల ప్రాఫిట్ ను అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.