సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా నరసింహా పురం కూడా ఒకటి, టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటుడు నందకిషోర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన రా రస్టిక్ నేపద్యంలో వచ్చిన నరసింహా పురం సినిమా తిమ్మరుసు మరియు ఇష్క్ సినిమాలతో పోటిగా రిలీజ్ ను సొంతం చేసుకుంది. అసలు ఈ సినిమాను జనాలు ఎవరూ పెద్దగా పట్టించుకునే అవకాశం అసలు లేదని అంతా అనుకున్నారు.
కానీ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు తర్వాత వచ్చిన కలెక్షన్స్ చూసి బి సి సెంటర్స్ లో జనాలు ఇప్పటికీ సినిమాల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది. సినిమా కి పెద్దగా ఎవరూ రివ్యూలు కూడా ఇవ్వలేదు. అయినా జనాలు థియేటర్స్ కి తరలి వచ్చారు.
సినిమా ని మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 100 నుండి 120 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేయగా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల దాకా గ్రాస్ ని ఈ సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుంది. మాస్ సెంటర్స్ లో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా…
ఈ సినిమాకి పడటం విశేషం. పోటి లో ఉన్న ఇష్క్ సినిమా ప్రమోషన్స్ పరంగా భారీగా ఖర్చు కూడా చేశారు. ఆ సినిమా తో పోల్చితే అసలు ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి లేకుండా పోస్టర్స్ తోనే జనాలను థియేటర్స్ కి రప్పించిన నరసింహా పురం సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఎక్స్ లెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే నైజాం లో టికెట్ రేట్లు నార్మల్ గానే ఉన్నా…
ఆంధ్రలో బి సి సెంటర్స్ లో టికెట్ రేట్లు 20, 30 ఆ లెవల్ లోనే ఉన్నాయి… అయినా కానీ 22 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకోవడం విశేషం. ఇక సినిమా బిజినెస్ వివరాలు లాంటివి ఏవి తెలియరాలేదు. లాంగ్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి డీటైల్స్ తెలిశాక మళ్ళీ అప్ డేట్ చేస్తాం..