Home న్యూస్ 3 థియేటర్స్ – 60,000….దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే!

3 థియేటర్స్ – 60,000….దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే!

2

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే ఇండియా లో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ సినిమా ను డిజిటల్ రిలీజ్ కి అనౌన్స్ చేసిన టైం లో ఇండియా లో థియేటర్స్ తెరచి ఉన్న ప్లేసులలో థియేటర్ రిలీజ్ ను అదే టైం లో డిజిటల్ రిలీజ్ చేస్తామన్నారు.

కానీ అలా జరగలేదు, డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ లో సుమారు 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడ అంచనాలను తగ్గట్లు కలెక్షన్స్ ని అయితే సాధించడం లేదు. కానీ పే పెర్ వ్యూ పద్దతి లో మాత్రం…

ఊహకందని కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఇండియా లో కొన్ని చోట్ల మాత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందట, మొత్తం మీద నార్త్ సైడ్ లో మూడు సెలెక్టివ్ ప్లేసులలో ఈ సినిమా 50% లిమిటేషన్ కండీషన్ మీద రిలీజ్ అవ్వగా ఎంత సల్మాన్ ఖాన్ సినిమా అయినప్పటికీ కూడా…

చిల్లర కలెక్షన్స్ ని కూడా సాధించలేక పోయింది ఈ సినిమా. మొత్తం మీద 4 రోజుల వీకెండ్ లో సినిమా మూడు థియేటర్స్ లో సాధించిన ఓవరాల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 60 వేలు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అనౌన్స్ చేశాయి. అంటే దాదాపు సినిమా డెఫిసిట్ లు అండ్ నెగటివ్ షేర్ తోనే మొదటి వీకెండ్ ని ఆ 3 థియేటర్స్ లో…

కంప్లీట్ చేసింది అని చెప్పొచ్చు. నార్మల్ టైం లో రిలీజ్ అయినప్పటికీ సినిమా టాక్ కి గట్టి ఎదురుదెబ్బే తగిలేది కానీ డిజిటల్ రిలీజ్ వలన బ్రతికి పోయిన ఈ సినిమా టాక్ పరంగా గట్టి ఎదురుదెబ్బ తగలగా ఓవర్సీస్ లో మరో ఎదురుదెబ్బ ఇప్పుడు థియేటర్స్ లో దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది అని చెప్పొచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here