సంక్రాంతి రేసులో పాన్ ఇండియా మూవీస్ తప్పుకోవడంతో మంచి జోష్ మీద రిలీజ్ అయ్యి సోలో సంక్రాంతి బిగ్గీగా వచ్చిన నాగార్జున నాగ చైతన్యలు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి పండగ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత స్లో డౌన్ అయింది. అయినా కానీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ వచ్చిన ఈ సినిమా….
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టింది. వీకెండ్ లో పర్వాలేదు అనిపిస్తున్న వర్కింగ్ డేస్ లో గట్టిగా స్లో అవుతున్న బంగార్రాజు మూడో వారం తర్వాత ఓవరాల్ గా సినిమా బిజినెస్ ను అందుకుని…
ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 20 వ రోజు 10 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 21 వ రోజు 8 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో ఓవరాల్ గా మూడో వారాల కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 8.31Cr
👉Ceeded: 6.88Cr
👉UA: 5.23Cr
👉East: 4.15Cr
👉West: 2.90Cr
👉Guntur: 3.45Cr
👉Krishna: 2.25Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 34.92CR(56.88Cr~ Gross)
👉Ka+ROI: 1.80Cr
👉OS – 1.50Cr
Total WW: 38.22CR(64.25CR~ Gross)
ఇదీ మొత్తం మీద బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ లెక్క….
సినిమాను మొత్తం మీద 38.15 కోట్లకు అమ్మగా 39 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది… లిమిటెడ్ కలెక్షన్స్ తో ఈ వారం రన్ అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది…. మరి సినిమా పరుగు ఎలా ఉంటుందో చూడాలి.