బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సిన యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కరోనా వలన రిలీజ్ కి నోచుకోలేదు. కానీ అప్పటికే సినిమాలో హిట్ అయిన సాంగ్ వలన సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కి మంచి ఆఫర్ వచ్చింది… 6.5 కోట్ల రేటు ఇవ్వడానికి లీడింగ్ యాప్స్ సిద్ధంగా ఉండగా ఆ ఆఫర్ ను ముందు తిరస్కరించారు సినిమా యూనిట్ వాళ్ళు. దాంతో తర్వాత పరిస్థితులు…
పూర్తిగా మారిపోగా… ఆ రేటు కూడా ఎవ్వరూ ఇవ్వడానికి ముందుకు రాక రేటు దిగుతూ వెళ్ళింది… ఆల్ మోస్ట్ 2.5 కోట్ల రేంజ్ లో లోవేస్ట్ ఆఫర్ లు కూడా సినిమా కి రాగా ఇక ఎం చేయాలో తెలియని పరిస్థితి లో సినిమా యూనిట్ ఉన్న టైం లో అనుకోకుండా…
కొంచం బెటర్ ఆఫర్ తో ఆహా వాళ్ళు 3 కోట్లకు పైగా రేటు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు… దాంతో ఈ డీల్ ఆల్ మోస్ట్ ఫైనల్ అవుతుంది అన్న టాక్ రాగా సడెన్ గా థియేటర్స్ రీ ఓపెన్ అవ్వడం సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం తో ఆ రేటు ఓకే కానీ… థియేటర్స్ లో కూడా సినిమాను…
రిలీజ్ చేయాలనీ కోరి… ఈ నెల 29 న సినిమాను థియేటర్స్ కి తీసుకు రాబోతున్నారట. ఒక వారం పాటు పోటి లేకుండా థియేటర్స్ లో ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగించాలని డిసైడ్ అయినట్లు సమచారం. దాంతో ఆహా యాప్ లో సినిమా ఎప్పుడు డిజిటల్ రిలీజ్ అవుతుంది అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి రాగా ఇప్పుడు ఆహా వాళ్ళు కూడా రేటు తగ్గించే పనిలో ఉన్నారని తెలుస్తుంది…
దాంతో నిర్మాతలు థియేటర్స్ లో కలెక్షన్స్ రూపంలో ఎంత వస్తే అంతే నని… సినిమా బాగుంటే కలెక్షన్స్ ఎక్కువ రావొచ్చు ఏమో అన్న నమ్మకంతో ఇప్పుడు రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతానికి అయితే బజ్ చాలా లో గా ఉన్న టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ప్రదర్శనని కనబరుస్తుందో చూడాలి ఇక..