Home గాసిప్స్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి….రేటు దారుణంగా పడిపోయిందిగా!

అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి….రేటు దారుణంగా పడిపోయిందిగా!

0

యాంకర్ ప్రదీప్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఎప్పుడో షూటింగ్ ను పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా కానీ సమ్మర్ లో అనుకున్న రిలీజ్ కరోనా వలన పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా బడ్జెట్ అండ్ అప్పులు కూడా పెరిగి పోయాయి, అయినా కానీ పెట్టిన బడ్జెట్ 4.5 కోట్లు కాగా డైరెక్ట్ రిలీజ్ కోసం సినిమా కి మొదట్లోనే…

మంచి ఆఫర్లు వచ్చాయి, ఆల్ మోస్ట్ 6.5 కోట్ల రేట్లు ఆఫర్స్ వచ్చినా కానీ యూనిట్ నో చెబుతూ రాగా తర్వాత టైం ని బట్టి పరిస్థితులు మారుతూ రేట్లు మరింత తగ్గుతూ వస్తుంది. రీసెంట్ గా సినిమా రేట్లు కంప్లీట్ గా తగ్గి కేవలం 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో…

రేట్లు రాగా ఆ రేటు చూసి యూనిట్ మళ్ళీ షాక్ అయ్యి రిలీజ్ పై నిర్ణయం తీసుకోకుండా ఆగిపోయారు… కొత్తవి ఏమైనా ఆఫర్స్ వస్తాయా లేవా అన్న ఆశలో ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం యాప్స్ మరింత తక్కువ ఆఫర్స్ చేస్తున్నాయట ఇప్పుడు.

ఇప్పుడు రేటు 2.5 కోట్ల రేంజ్ లోనే రేట్లు ఆఫర్స్ వస్తున్నాయి అని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది, బడ్జెట్ దృశ్యా చూసుకుంటే సగం రేటు మాత్రమె అని చెప్పాలి. ముందే వచ్చిన ఆఫర్ ని ఒప్పుకుంటే 2 కోట్ల ప్రాఫిట్ తో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఉండేది. కానీ ఇప్పుడు రేటు భారీ గా తగ్గడం తో….

థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నా కానీ జనాలు 50% ఆక్యుపెన్సీ తో వచ్చినా రికవరీ అవ్వడం కష్టమే అవుతూ ఉండటం తో ఒకటి లేదా 2 డిజిటల్ యాప్స్ కి కొంచం తక్కువ రేటుకి అమ్మి శాటిలైట్ రైట్స్ తో ఎంతో కొంత సేఫ్ జోన్ లో నిలవాలని ట్రై చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here