Home న్యూస్ అటు రికార్డులు…ఇటు దారుణమైన షాక్ లో యూనిట్!

అటు రికార్డులు…ఇటు దారుణమైన షాక్ లో యూనిట్!

0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ మూవీ భారీ అంచనాల నడుమ రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమాకి బాలీవుడ్ లో నార్త్ లో కంప్లీట్ నెగటివ్ రివ్యూలు దక్కాయి, సౌత్ లో అయినా సినిమా పర్వాలేదు అని చెప్పారు కానీ బాలీవుడ్ లో కంప్లీట్ గా సినిమాను తిరస్కరించారు.

ఇక సినిమా ఇన్ని నెగటివ్ రివ్యూ లను కూడా సొంతం చేసుకున్నా కానీ మొదటి రోజు రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ని సినిమా ఫస్ట్ డే సొంతం చేసుకుందని చెప్పగా…

సినిమా కి IMDB లో యూసర్ రేటింగ్ మాత్రం డిసాస్టర్ అనిపించే విధంగా లోవేస్ట్ రేటింగ్స్ తో షాక్ ఇచ్చారు యూసర్స్ అందరూ… రీసెంట్ టైం లో ఆలియా భట్ సడక్ 2 సినిమా విషయం లో కూడా 1 స్టార్ రేటింగ్ దక్కించుకుని లోవేస్ట్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాగా…

బ్యాడ్ రికార్డ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు అక్షయ్ కుమార్ లక్ష్మీ సినిమా కూడా 2.2 స్టార్ రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. దాంతో బాలీవుడ్ లో సినిమా పై ఎలాంటి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉందీ అన్నది క్లియర్ అయ్యింది అని చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పుడు సినిమా డిస్నీ ప్లస్ లో వ్యూస్ వస్తున్నా కానీ…

ఓవరాల్ గా ఇలాంటి బ్యాడ్ రికార్డులు కూడా తోడూ అవుతూ షాక్ ఇస్తుంది కానీ డిస్నీ ప్లస్ కి ఇది ఏమాత్రం ఇంపాక్ట్ చూపదు అని చెప్పొచ్చు. వాళ్లకి వ్యూస్ పరంగా మాత్రం సాలిడ్ గా ఓపెనింగ్స్ దక్కడంతో ఇలానే కొద్ది కాలం వస్తే వాళ్లకి సినిమా ద్వారా ప్రాఫిట్స్ వచ్చినా రావొచ్చు అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here