Home న్యూస్ వాల్తేరు వీరయ్య @ 300…మెగాస్టార్ మాస్ ఊచకోత!

వాల్తేరు వీరయ్య @ 300…మెగాస్టార్ మాస్ ఊచకోత!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) లాస్ట్ ఇయర్ బాక్ టు బాక్ ఆచార్య(Acharya) మరియు గాడ్ ఫాదర్(God Father) సినిమాలతో బాక్ టు బాక్ నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఈ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను…

సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా ఆల్ టైం హైయెస్ట్ లాభాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది…. టోటల్ రన్ లో 137.85 కోట్ల షేర్ ని 236.15 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా…

రీసెంట్ గా టెలివిజన్ లో మాత్రం నిరాశ పరిచే టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒక థియేటర్ లో బిగ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది. ఏకంగా ఈ థియేటర్ లో సినిమా 100, 200 రోజుల తర్వాత 250 రోజులను పూర్తి చేసుకుని ఇప్పుడు ఏకంగా 300 రోజులను కూడా కంప్లీట్ చేసుకుంది…

“అవనిగడ్డ” లో శ్రీ రామకృష్ణ థియేటర్ లో రోజు 4 షోలతో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు 300 రోజులను అక్కడ పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది….రోజూ 4 షోలతో ఇలా 300 రోజులను పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

సినిమాతో ఎపిక్ హిట్ కొట్టిన మెగాస్టార్ వెంటనే భోలా శంకర్(Bholaa Shankar) తో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న మెగా 156 సినిమాతో అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఎపిక్ కంబ్యాక్ ను తిరిగి సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here