Home న్యూస్ 30 కోట్లు-60 కోట్లు…2 ఔట్…..భీభత్సం ఇది!

30 కోట్లు-60 కోట్లు…2 ఔట్…..భీభత్సం ఇది!

0

  హీరో రామ్ కెరీర్ మొదలు అయ్యి 13 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటి వరకు నికార్సయిన మాస్ హిట్ లేదు అన్న అపవాదు ఉండేది, మధ్యలో కందిరీగ లాంటి బ్లాక్ బస్టర్ మాస్ లో పడినా అది కమర్షియల్ బ్లాక్ బస్టర్ కానీ మాస్ హిట్ కాదు. కానీ ఇప్పుడు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఆ కోరిక తీరుస్తూ మాస్ ప్రేక్షకుల అండతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సత్తా చాటుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా…నిర్మాతల లెక్కల ప్రకారం 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా అందుకుని సత్తా చాటింది. ఫైనల్ కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా సినిమా విజయంతో…

ఇప్పటి వరకు కెరీర్ లో ఎదురు చూస్తున్న నికార్సయిన మాస్ హిట్ పడటంతో ఇక మీదట చేయబోయే సినిమాల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని రామ్ భావిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి మరో ఒకటి రెండు హిట్లు పడితే తన రేంజ్ మరో లెవల్ కి చేరే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here