బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ తర్వాత చేసిన సినిమాల్లో ఖైదీ నంబర్ 150 మాత్రమే క్లీన్ హిట్ గా నిలవగా తర్వాత చేసిన ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ ని లాభాలను సొంతం చేసుకోలేదు. కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లాభాలను కూడా సొంతం చేసుకుంటూ…
దూసుకు పోతుండగా సినిమా లాభాల పరంగా కొత్త మైలురాయిని అందుకుంటూ దూసుకు పోతుంది. రీసెంట్ గా 25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున సొంతం చేసుకున్న…
కలెక్షన్స్ తో 30 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి. ఇక ఈ రోజు రిపబ్లిక్ డే హాలిడే అలాగే వీకెండ్ కూడా ముందు ఉండటంతో సినిమా ఈ లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఫైనల్ రన్ లో మరో 10 కోట్ల లోపు లాభాన్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి అంతకన్నా మించి ముందుకు వెళుతుందో లేదో చూడాలి ఇక…