కోలివుడ్ లో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి ఏమాత్రం సంభందం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న హీరో విజయ్ సేతుపతి, తెలుగు లో కూడా సైరా సినిమా తో మెప్పించగా ఉప్పెన సినిమాతో తెలుగు లో సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకోగా ఆ క్రేజ్ ను వాడుకోవాలని విజయ్ సేతుపతి ఓల్డ్ మూవీస్ అలాగే కొత్త సినిమాలను తెలుగు లో క్రమం తప్పకుండా డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండగా…..
ఇప్పుడు విజయ్ సేతుపతి కెరీర్ లో తొలిసారి ఒక సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో ఒకే టైం లో రిలీజ్ చేశారు, ఆ సినిమానే లాభం సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 32 కోట్ల…
భారీ బడ్జెట్ లో రూపొందగా తెలుగు లో విజయ్ సేతుపతికి క్రేజ్ ఉన్న బాక్స్ ఆఫీస్ మార్కెట్ ఇంకా సెట్ కాలేదు కాబట్టి ఈ సినిమాను 80 లక్షల రేటు పెట్టి కొన్నారు. సినిమా బాక్స్ అఫీస్ దగ్గర తెలుగు లో 1 కోటి రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో 10 లక్షల గ్రాస్ ని, 6 రోజుల్లో 16 లక్షల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 23 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను అలాగే 14 లక్షల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్స్ లో కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ఉన్నాయి…
అవి తీసేస్తే ఇక సినిమా షేర్ ఏమి ఉండదు అని చెప్పాలి. మొత్తం మీద తెలుగు లో 1 కోటి టార్గెట్ లో పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి రాబట్టలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలనే సొంతం చేసుకుంది. తమిళ్ లో కూడా సినిమా తీవ్ర నష్టాలను సొంతం చేసుకుందని అక్కడ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.