Home న్యూస్ ఆల్ ఇండియా రికార్డులను టార్గెట్ చేసిన లవ్ స్టొరీ…పక్కా ఇది!!

ఆల్ ఇండియా రికార్డులను టార్గెట్ చేసిన లవ్ స్టొరీ…పక్కా ఇది!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా లవ్ స్టొరీ… బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు భారీ గా ఉన్నాయి, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఓపెనింగ్స్ రూపంలో అద్బుతాలు నమోదు చేయోచ్చు అంటున్నారు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో…

ఇంకా టికెట్ రేట్లు నార్మల్ చేయడం, 4 షోలు వేసుకునే వెసులుబాటు మరియు 100% ఆక్యుపెన్సీ లాంటివి ఇంకా అప్రూవ్ చేయాల్సి ఉంది కానీ ఏ నిమిషంలో అయినా ఈ అప్రూవల్ ని ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, టికెట్ హైక్స్ కాకుండా మిగిలిన 2 మాత్రం త్వరగా అప్రూవ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుండగా…

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అవ్వగా సినిమా బుకింగ్స్ కి రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లో కొనసాగుతుంది. సెకెండ్ వేవ్ తర్వాత బెస్ట్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్…

జోరు చూస్తుంటే ఫస్ట్ డే సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఆల్ ఇండియా ఓపెనింగ్స్ రికార్డ్ ను సీటిమార్ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత సొంతం చేసుకుని టాప్ లో ఉంది. లవ్ స్టొరీ సినిమా ఇప్పుడు అన్నీ అనుకూలంగా జరిగితే సీటిమార్ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కన్నా కూడా…

డబుల్ మార్జిన్ తో ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా ఇక ఈ పరిస్థితులలో కూడా దుమ్ము దుమారం రేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here