ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఊహకందని ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా హిస్టారికల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు సినిమా ఎపిక్ రన్ ను సొంతం చేసుకుందని చెప్పాలి…
రికార్డుల జాతర సృష్టించి 50 రోజుల పాటు షేర్స్ ని రాబట్టి ఇప్పటికీ హిందీలో వసూళ్ళని రాబడుతున్న సినిమా ఇతర ఏరియాల్లో ఒక్కోటిగా పరుగును పూర్తి చేసుకుంటుంది…ఈ క్రమంలో సినిమా పక్క రాష్ట్రం కర్ణాటకలో టోటల్ రన్ ని పూర్తి చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో..
కలెక్షన్స్ ని దక్కించుకుని మాస్ రచ్చ చేసింది. మొత్తం మీద 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను కర్ణాటకలో సొంతం చేసుకున్న సినిమా ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ లో మాస్ రచ్చ చేసే కలెక్షన్స్ ని అందుకుని 100 కోట్ల గ్రాస్ మార్క్ ని సైతం క్రాస్ చేసి సంచలనం సృష్టించింది..
టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సినిమా కర్ణాటకలో 53.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది….ఓవరాల్ గా కర్ణాటక నుండి సినిమా కి ఆల్ మోస్ట్ 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు అన్ని భాషలు కలిపి సొంతం అయ్యాయి..
మొత్తం మీద 32 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ రన్ లో ఇక్కడ ఎక్స్ లెంట్ లాభాలను అందుకుంది. ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 20.5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని కర్ణాటకలో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా…ఇక మిగిలిన ఏరియాల్లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.
Fake collections
Cry more