టాలీవుడ్ లో పెద్ద సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, అదే టైంలో ఆ సినిమాలు ఫ్లాఫ్ టాక్ తో కూడా కొన్ని మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. కానీ పెద్ద సినిమాలతో పోల్చితే మీడియం రేంజ్ మూవీస్…
ఒకవేళ మిక్సుడ్ టాక్ ను కనుక సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా తేరుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, మీడియం రేంజ్ మూవీస్ హిట్ టాక్ తో కూడా యావరేజ్ గా 25 నుండి 30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం చాలా రేర్ గా ఉంటుంది…
అలాంటి ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 33 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని…
సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి…. మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 33 కోట్ల షేర్ ని అందుకోవడం మామూలు విషయం కాదు… ఈ సినిమా ఇప్పుడు టోటల్ రన్ లో సాధించే కలెక్షన్స్ ఇప్పుడు అప్ కమింగ్ మీడియం రేంజ్ …
మూవీస్ ఒకవేళ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంటే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా కూడా అదే టైంలో అప్ కమింగ్ మీడియం రేంజ్ ఫ్లాప్ మూవీస్ కి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది అని చెప్పాలి.