బాక్స్ ఆఫీస్ దగ్గర వారం వారం కొత్త సినిమాలను తట్టుకుంటూ కూడా దుమ్ము లేపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ కల్కి మూవీ(Kalki 2898 AD Movie) లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ధనుష్(Dhanush) నటించిన 50వ సినిమా రాయన్(Raayan Movie) లు వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా…
రెండు సినిమాలు కూడా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నాయి…కల్కి మూవీ 33వ రోజులో ఎంటర్ అవ్వగా 32వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా సినిమా…
25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో కూడా డ్రాప్ అయిన సినిమా మిగిలిన చోట్ల మరింత డ్రాప్ అవ్వగా ఓవరాల్ గా సినిమా 33వ రోజు వరల్డ్ వైడ్ గా 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం కొద్దివరకు ఉంది.
ఇక 4వ రోజులో ఎంటర్ అయిన రాయన్ మూవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా డీసెంట్ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషమని చెప్పాలి…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4వ రోజు 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఇక తమిళనాడులో సినిమా 4-4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున ఇప్పుడు 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా…
ఓవరాల్ గా రాయన్ వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా డ్రాస్టిక్ డ్రాప్స్ ఉంటే తప్పితే రెండు సినిమాలు ఇవే రేంజ్ లో షేర్స్ ని అందుకోవచ్చు. ఇక మొత్తం మీద 2 సినిమాల వర్కింగ్ డే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.