యూత్ స్టార్ నితిన్ నభా నటేష్ మరియు తమన్నా ల కాంబినేషన్ లో హిందీ లో సూపర్ డూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమాను తెలుగులో మాస్ట్రో పేరు తో రీమేక్ చేయగా సినిమా భారీ లెవల్ లో రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది అనుకుంటే సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది…
ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళకి పర్వాలేదు అనిపించిన ఈ సినిమా చూడని వాళ్ళని మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటూ మంచి మౌత్ టాక్ ని సొంతం చేసుకుని సోషల్ మీడియాలో పాజిటివ్ ట్వీట్స్ తో దూసుకు పోతుంది, మరో పక్క టీం కూడా రిలీజ్ టైం కి…
సినిమాను బాగా ప్రమోట్ చేస్తూ ఉండటం తో సినిమా రిలీజ్ రోజున ఇతర ప్లాట్ ఫామ్స్ లో పోటి లో మరిన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ సెన్సేషనల్ అనిపించే రేంజ్ వ్యూవర్ షిప్ ను డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపిందని అంటున్నారు ఇప్పుడు…
టోటల్ వ్యూస్ లెక్క అఫీషియల్ గా ఏమి రిలీజ్ అవ్వలేదు కానీ తెలుగు లో డిస్నీ ప్లస్ లో వచ్చిన మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. అలగే ఇతర లాంగ్వేజ్ మూవీస్ తో పోల్చితే తెలుగు మాత్రమె ఉన్నప్పటికీ వాటితో కూడా పోటి పడే రేంజ్ లో సినిమాకి వ్యూవర్ షిప్….
మొదటి రోజుకి సొంతం అయ్యిందని చెబుతున్నారు ఇప్పుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే సినిమా రోజు కలెక్షన్స్ తో సందడి చేసేది కానీ ఇప్పుడు 34 కోట్ల రేటు తో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మేకర్స్ కి మంచి ప్రాఫిట్స్ ఇచ్చినా నితిన్ కి బాక్స్ ఆఫీస్ కంబ్యాక్ మిస్ అయ్యింది అని చెప్పాలి.. ఇక సినిమా అఫీషియల్ వ్యూవర్ షిప్ ఎలా ఉందో త్వరలో తేలనుంది.