Home న్యూస్ ఫాస్టెస్ట్ 35K ఇటు 10K అటు…ఇండియన్ మూవీస్ లో రికార్డ్!!

ఫాస్టెస్ట్ 35K ఇటు 10K అటు…ఇండియన్ మూవీస్ లో రికార్డ్!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ అయిన దేవర పార్ట్1(Devara Part 1) గ్రాండ్ గా రిలీజ్ కి సిద్దం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ ఆడియన్స్ లో అంచనాలు మరో లెవల్ లో ఉండగా….

రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకి సాలిడ్ రీచ్ నే సొంతం అయ్యేలా చేసింది. ఇక ఆడియన్స్ ముందుకు సినిమా రావడానికి టైం దగ్గర పడుతూ ఉండగా రికార్డుల విషయంలో అడ్వాన్స్ టికెట్ సేల్స్ పరంగా సాలిడ్ గా రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…

సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి వారం అవుతూ ఉండగా  నార్త్ అమెరికాలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తున్న సినిమా ఆల్ రెడీ అమెరికాలో 1 మిలియన్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా….

కాగా సినిమా అమెరికాలో ఓవరాల్ గా ఫాస్టెస్ట్ 35 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఇండియన్ మూవీ గా రికార్డ్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. దాంతో పాటు యు కే లో కూడా రిమార్కబుల్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ అక్కడ కూడా 10 వేల కి పైగా టికెట్ సేల్స్ ను…

సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టిస్తూ అక్కడ కూడా ఇండియన్ మూవీస్ లో రికార్డ్ కొట్టింది. ఓవరాల్ గా సినిమా ఫాస్టెస్ట్ టికెట్ సేల్స్ తో ఇండియన్ మూవీస్ లో రికార్డ్ కొడుతూ ఉండగా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది రికార్డుల విషయంలో మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో రికార్డులను సృష్టిస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here