బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వగా 2 సినిమాలు వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపాయి. ఓపెనింగ్ డే పరంగా బాలయ్య వీర సింహా రెడ్డి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకోగా రెండో రోజు నుండి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ వీర విహారం చేశాడు… ఇక 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఆల్ మోస్ట్…
ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా మొత్తం మీద 2 సినిమాల లేటెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 365 కోట్ల మార్క్ నీ దాటేయడం విశేషం అని చెప్పాలి. వీర సింహా రెడ్డి సినిమా మొత్తం మీద 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
మెగాస్టార్ చిరంజీవి ఊచకోత కోస్తూ 232 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం విశేషం. దాంతో 2 సినిమాలు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 365 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సంక్రాంతికి సొంతం చేసుకుని టాలీవుడ్ కి అల్టిమేట్ స్టార్ట్ ని ఇచ్చాయి.
బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని వీర సింహా రెడ్డి తో సొంతం చేసుకోగా మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ షేర్ మూవీ ని వాల్తేరు వీరయ్యతో సొంతం చేసుకున్నాడు…. ఈ సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు ఏవి కూడా ఇప్పుడు రిలీజ్ లేక పోవడంతో ఫస్టాఫ్ లో ఈ రెండు సినిమాలు టాప్ లో నిలిచే అవకాశం కనిపిస్తుంది.
శివ వేద కన్నడ డబ్బింగ్ సినిమా గురించి ఒక వీడియో చెయ్ బ్రో, బ్రేక్ ఈవెన్ టార్గెట్ and బిజినెస్ pls🙏