Home న్యూస్ 36 కోట్ల మాస్ జాతర….ఈ జాతర ఇప్పట్లో ఆగదు!!

36 కోట్ల మాస్ జాతర….ఈ జాతర ఇప్పట్లో ఆగదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్ హీరోగా 2014 లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ కార్తికేయ2 సినిమా అద్బుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. మూడు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ…

సాలిడ్ హోల్డ్ తో పరుగును స్టడీగా కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో టోటల్ గా 32.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా….

ఇప్పుడు 5వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు అవలీలగా 2.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా అవలీలగా 3.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునేలా ఉంది.

దాంతో సినిమా మొత్తం మీద 5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద వర్కింగ్ డేస్ లో కూడా…

ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ కచ్చితంగా ఉన్నట్లేనని చెప్పాలి. దానికి తోడూ లైగర్ వచ్చే వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ కి ఈ సినిమా ఫస్ట్ హాట్ ఫేవరేట్ మూవీ అని చెప్పాలి ఇప్పుడు. హిందీలో ఈ వీక్ లో భారీ లెవల్ లో స్క్రీన్స్ ను సొంతం చేసుకోబోతుండటంతో అక్కడ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here