బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ మూవీ ఇప్పుడు 23 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 380 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. సినిమా లాంగ్ రన్ లో 400 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా డిజిటల్ రిలీజ్ కి కూడా ఇప్పుడు సిద్ధం అవుతుందని సమాచారం… కాగా సినిమా డిజిటల్ రైట్స్ ని….
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా సినిమాను అన్నీ అనుకున్నట్లు జరిగితే రిలీజ్ అయిన 6 వారాల టైం తర్వాత రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఆ లెక్క ప్రకారం సినిమా డిజిటల్ రిలీజ్ ను జులై 8న సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఒక పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా అప్పటి వరకు కూడా పరుగును కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది, కాగా సినిమా తమిళనాడులో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తమిళ్ వర్షన్ పరంగా ఓవరాల్ గా తమిళ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది…