ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి 3 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో ఎంటర్ అయింది, కాగా సినిమా కి ఇప్పటికీ జనాలు థియేటర్స్ లో డీసెంట్ నంబర్స్ లో వస్తూ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలపగా హిందీలో సెన్సేషనల్ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తున్న…
పుష్ప సినిమా ఇప్పుడు నాలుగో వారంలో ఎక్స్ లెంట్ థియేటర్స్ హోల్డ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా మూడో వారంలో 385 థియేటర్స్ రన్ అవ్వగా, ఈ వారం ఆర్ ఆర్ ఆర్ కోసం థియేటర్స్ అన్నీ ఇవ్వాల్సింది కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో…
ఇప్పుడు పుష్ప నైజాంలో 160 సీడెడ్ లో 80 థియేటర్స్, ఆంధ్రలో 150 థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో 390 థియేటర్స్ లో నాలుగో వారాన్ని కొనసాగిస్తుంది. ఇది నిజంగానే సెన్సేషన్ అని చెప్పాలి, అదే టైం లో సినిమా ఈ రోజే ప్రైమ్ లో కూడా రిలీజ్ అవ్వడం గట్టి దెబ్బ. మరి ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద పడుతుందో లేదో చూడాలి.