బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్ ప్రైడ్ అని చెప్పుకున్న పొన్నియన్ సెల్వన్2 సినిమా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సాధించినా కూడా మొదటి పార్ట్ సక్సెస్ ను అయితే అందుకోలేక పోయింది. కలెక్షన్స్ పరంగా ఎక్కడా కూడా మొదటి పార్ట్ రేంజ్ లో వసూళ్ళని అందుకునే విషయంలో విఫలం అయిన ఈ సినిమా హిస్టరీ లో భారీ ఎత్తున…
పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో మొదటి పార్ట్ కన్నా సీక్వెల్ తక్కువ కలెక్షన్స్ ని అందుకోవడం ఈ సినిమాకే చెల్లింది. ఇక తెలుగు లో కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా తెలుగు లో కూడా ఫ్లాఫ్ గానే పరుగును పూర్తీ చేసుకుంది.
థియేటర్స్ లోనే సినిమాను అనుకున్న రేంజ్ లో చూడలేదు అంటే ఇప్పుడు సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేశారు… ఎదో పార్ట్ 1 లా రిలీజ్ చేయకుండా ఇప్పుడు సినిమాను డిజిటల్ లో చూడాలి అనుకుంటే పే పెర్ వ్యూ పద్దతిలో రేటు చెల్లించి సినిమాను చూడవచ్చు అని ఆఫర్ పెట్టారు ప్రైమ్ వీడియో వాళ్ళు…
సినిమాను డిజిటల్ లో చూడాలి అంటే 399 రేటు పెట్టి కొంటె ఒక రోజు మొత్తం ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు చూసే అవకాశం ఉంటుందట. ఈ రేటు ఎదో 100-150 వరకు ఉన్నా బాగుండేది కానీ మరీ 399 పెట్టి ఎవరు చూస్తారు. అది కూడా థియేటర్స్ లోనే అనుకున్న రేంజ్ లో చూడని సినిమా కోసం ఇప్పుడు డిజిటల్ లో ఈ రేటు పెట్టి చూసేంత ఓపిక ఎవ్వరికీ లేదనే చెప్పాలి. చూస్తె కోలివుడ్ ఆడియన్స్ కొద్ది వరకు చూసే అవకాశం ఉంటుందేమో కానీ ఇతర ఆడియన్స్ అయితే కష్టమే అని చెప్పొచ్చు.