Home న్యూస్ డిసాస్టర్ మూవీ…రీ రీరిలీజ్ లో 3 డేస్ లో ఊహకందని కలెక్షన్స్ రాంపెజ్!

డిసాస్టర్ మూవీ…రీ రీరిలీజ్ లో 3 డేస్ లో ఊహకందని కలెక్షన్స్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒరిజినల్ రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ అయినా రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ లో పర్వాలేదు అనిపించి ఇప్పుడు 2024 సెప్టెంబర్లో లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి ఈ సారి అందరి అంచనాలను మించి పోయే రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది ధనుష్(Dhanush) నటించిన డిసాస్టర్ మూవీ అయిన 3మూవీ(3Movie Re Re Release Collections) సినిమా…

రీ రిలీజ్ లో మొదటి రోజు అందరి అంచనాలను మించి పోయిన ఈ సినిమా ఏకంగా 1.48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించి అనేక ఇతర బిగ్ రీ రిలీజ్ ల కన్నా కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి మాస్ రచ్చ చేసింది..

చాలా వరకు రీ రిలీజ్ లు మొదటి రోజు తర్వాత రెండో రోజు ఉన్న స్క్రీన్స్ లో పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించవు కానీ 3 మూవీ మాత్రం రెండో రోజు అలాగే మూడో రోజు వర్కింగ్ డే లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపిచడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా రెండో రోజు ఏకంగా 46 లక్షల దాకా గ్రాస్ ను అందుకోగా మూడో రోజు కూడా మరోసారి మంచి జోరు ని చూపించి 20 లక్షల మేర గ్రాస్ ను కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. దాంతో టోటల్ గా సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి…

ఏకంగా 2.14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలో ఒకటిగా నిలిచింది. రీసెంట్ రీ రిలీజ్ లతో పోల్చితే అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇలాంటి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here