Home న్యూస్ మోహన్ లాల్ “బరోజ్3D” 3 DAYS టోటల్ కలెక్షన్స్…చుక్కలు కనిపించాయి సామి!!

మోహన్ లాల్ “బరోజ్3D” 3 DAYS టోటల్ కలెక్షన్స్…చుక్కలు కనిపించాయి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ వీకెండ్ లో ఆడియన్స్ ను అలరించడానికి వచ్చిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) డైరెక్ట్ చేసిన సినిమా బరోజ్3D(Barroz3D Movie) ట్రైలర్ లో చూపించిన ఔట్ పుట్ చూసిన తర్వాత సినిమా కూడా గ్రాండియర్ గా ఆకట్టుకుంటుంది అని అందరూ అనుకున్నా కూడా…

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓ రేంజ్ లో ఆడియన్స్ ను నిరాశ పరిచింది. దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై కూడా పడి మొదటి రోజు కేవలం 5.50 కోట్ల రేంజ్ లో నే గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా…

సినిమా ఇప్పుడు మూడు రోజులను పూర్తి చేసుకోగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించలేక కొన్న బయర్స్ కి ఇప్పుడు చుక్కలు చూయించడానికి సిద్ధం అవుతుంది. రెండో రోజు కేవలం 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కేరళలో అందుకున్న సినిమా మూడో రోజు కోటి లోపే గ్రాస్ ను అందుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి రోజు 30 లక్షల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా 3 రోజుల్లో ఓవరాల్ గా 45 లక్షల లోపే గ్రాస్ ను అందుకుని కంప్లీట్ వాషౌట్ అయిపొయింది ఇప్పుడు…తెలుగు లో డిసాస్టర్ అయినా కూడా కేరళలో అయినా…

మినిమమ్ ఇంపాక్ట్ ని అయినా చూపిస్తుంది అనుకుంటే అక్కడ కూడా చేతులు ఎత్తేసిన సినిమా 3 రోజుల్లో టోటల్ గా వరల్డ్ వైడ్ గా 8.50 కోట్ల రేంజ్ లో నే గ్రాస్ ను అందుకుని షాకిచ్చింది. షేర్ 4 కోట్ల లోపే ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…

మినిమమ్ 25 కోట్ల రేంజ్ లోనే అయినా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా, సినిమా ఇక ఏ దశలో కూడా ఆ మార్క్ ని అందుకునే అవకాశమే లేదు అని చెప్పాలి. చిన్న పిల్లలను టార్గెట్ చేసినప్పటికీ కూడా ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోలేక పోయింది సినిమా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here