Home న్యూస్ కల్కి 3 డేస్ టోటల్ కలెక్షన్స్….3వ రోజు 101 కోట్ల మాస్ ఊచకోత!!

కల్కి 3 డేస్ టోటల్ కలెక్షన్స్….3వ రోజు 101 కోట్ల మాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) అల్టిమేట్ కలెక్షన్స్ తో మొదటి 3 రోజులను కంప్లీట్ చేసుకుంది. 3 వ రోజు క్రికెట్ మ్యాచ్ వలన ఇబ్బంది వచ్చినా కూడా రెండో రోజుకి మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే వసూళ్ళని సొంతం చేసుకున్న సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగి ఉండేది…

మొత్తం మీద మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 19.83 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా హిందీలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ లాంటి ఏరియాల్లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా సినిమా టాక్ కి ఫుల్ న్యాయం చేస్తూ ఓవర్సీస్ కలెక్షన్స్ ప్రీమియర్స్ నుండే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి…

అన్నీ కలిపి సినిమా 3వ రోజున వరల్డ్ వైడ్ గా మరోసారి 50 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి 51.08 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఓవరాల్ గా 101 కోట్ల మార్క్ సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసేలా హోల్డ్ ని కొనసాగించింది…ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 3 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 40.75Cr
👉Ceeded: 9.82CR
👉UA: 9.85Cr
👉East: 6.19Cr
👉West: 4.44Cr
👉Guntur: 5.56CR
👉Krishna: 5.20Cr
👉Nellore: 2.88Cr
AP-TG Total:- 84.69CR(132.30CR~ Gross)
👉KA: 12.40Cr
👉Tamilnadu: 6.85Cr
👉Kerala: 4.00Cr
👉Hindi+ROI: 37.90Cr
👉OS – 52.20Cr*****
Total WW Collections: 198.04CR(Gross- 380.70CR~)

టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజులు పూర్తి అయ్యే టైం కి సినిమా 198.04 కోట్లు రికవరీ చేయగా మిగిలిన రన్ లో మరో 173.56 కోట్ల రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here