Home న్యూస్ 4th DAY కల్కి ఓపెనింగ్స్….ఈ రోజు రికార్డుల జాతర ఖాయం!!

4th DAY కల్కి ఓపెనింగ్స్….ఈ రోజు రికార్డుల జాతర ఖాయం!!

0

రిమార్కబుల్ కలెక్షన్స్ తో మూడు రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4వ రోజులో ఎంటర్ అయ్యింది… ఒకపక్క ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉండగా మరోపక్క థియేటర్స్ లో జనాలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో కల్కి థియేటర్స్ కి ఎగబడుతున్నారు….

దాంతో బుక్ మై షోలో గంట గంటకి టికెట్ సేల్స్ లో సెన్సేషనల్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా సినిమా డే 3తో పోల్చితే డే4 సూపర్బ్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది…..తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి సాలిడ్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా మూడో రోజుతో పోల్చితే నైజాంలో 4వ రోజు రాంపెజ్ ను చూపిస్తూ దూసుకు పోతుంది…

ఆంధ్ర సీడెడ్ లలో కూడా బుకింగ్స్ ట్రెండ్ మూడో రోజు కన్నా బెటర్ గా ఉండటంతో ఓవరాల్ గా 4వ రోజు 20 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…ఇక హిందీలో బెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ దిశగా దూసుకు పోతున్న సినిమా 35 కోట్ల రేంజ్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

   

ఇక రిలీజ్ కి ముందు డౌట్ ఉన్న తమిళ్ అండ్ కేరళలో సినిమా 4వ రోజు రిలీజ్ అయిన రోజు నుండి బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ దిశగా అల్టిమేట్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది. ఇక కర్ణాటకలో బుకింగ్స్ ట్రెండ్ సూపర్ సాలిడ్ గా ఉండగా మొత్తం మీద ఇండియాలో సినిమా 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 48 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది…

ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను మరోసారి కొనసాగించే అవకాశం ఉన్న సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నైట్ షోలకు వర్షాలు వలన ఏమైనా ప్రాబ్లంస్ ఉంటే తప్పితే ఈ అంచనాలను అందుకోవడమో లేక మించిపోవడమో జరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే ఎండ్ కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here