Home న్యూస్ తమిళ్ బ్లాక్ బస్టర్ “నాయకుడు” తెలుగు వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

తమిళ్ బ్లాక్ బస్టర్ “నాయకుడు” తెలుగు వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా మామన్నన్(Maamannan) తెలుగు లో నాయకుడు(Nayakudu) పేరుతో వచ్చి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఇతర సినిమాల పోటి వలన…

అనుకున్న రేంజ్ లో జోరుని చూపించలేక పోయింది. అయినా కానీ ఉన్నంతలో మరీ గ్రోత్ ని చూపించకున్నా డీసెంట్ హోల్డ్ తోనే పరుగును కొనసాగించడం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద….

Nayakudu 3 Days Telugu Version Collections
2 రోజుల్లో 88 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల ఊపులో కొంచం స్లో అయినా ఉన్నంతలో 40 లక్షల రేంజ్ లో మరోసారి…

గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వీకెండ్ లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 1.28 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా షేర్ 60 లక్షల దాకా సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో సినిమా మొత్తం మీద 2 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి….

సినిమా ఇంకా 1.40 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మొత్తం మీద సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఇదే విధంగా హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తే బిజినెస్ లో ఇంకా చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here