Home న్యూస్ కాజల్ సత్యభామ వీకెండ్ కలెక్షన్స్…డే 2 కన్నా డే 3 ఎక్కువ!!

కాజల్ సత్యభామ వీకెండ్ కలెక్షన్స్…డే 2 కన్నా డే 3 ఎక్కువ!!

0

ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మూవీస్ లో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama Movie) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ కొంచం తక్కువే వచ్చినా కూడా రెండో రోజు…

సినిమా పుంజుకుని కొంచం గ్రోత్ ని చూపించింది. మూడో రోజు సండే మిగిలిన సినిమాలు డ్రాప్ అవ్వగా ఈ సినిమా కి మాత్రం 6.5 వేలకు పైగా టికెట్ సేల్స్ బుక్ మై షోలో సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసి ఎంతో కొంత కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం.

సినిమా వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సాధించిన ట్రేడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Kajal Aggarwal Satyabhama Movie 3 Days WW Collections Report
👉Nizam – 0.32CR~
👉Total AP: 0.40CR~
Total AP-TG Collections:- 0.72CR~(1.45CR~ Gross)
👉KA+ROI+OS: 0.10CR~
Total WW Collections- 0.82CR(1.70CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 2 కోట్ల దాకా ఉండగా సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి. వర్కింగ్ డేస్ లో కొంచం హోల్డ్ చేస్తే కలెక్షన్స్ ని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here