Home TRP రేటింగ్ హిలేరియస్ కామెడీ…1.5 కోట్ల రేటు…తెలుగు TRP రేటింగ్ తెలిస్తే షాక్!

హిలేరియస్ కామెడీ…1.5 కోట్ల రేటు…తెలుగు TRP రేటింగ్ తెలిస్తే షాక్!

0

రీసెంట్ గా టెలివిజన్ లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండటం తో కొత్తగా ఇతర భాషల్లో రూపొందిన సినిమాలను ఇక్కడ డైరెక్ట్ ఛానెల్స్ డబ్బింగ్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ ని తీసుకుని డబ్ చేసి డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇలానే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో జయం రవి మరియు కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో రూపొందిన కోమాలి సినిమా కూడా ఒకటి అని చెప్పాలి.

రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కూడా కామెడీ బాగా ఆకట్టుకుందని మెచ్చుకున్నారు. కథ లో దమ్ము లేకున్నా కామెడీ వర్కౌట్ అవ్వడం తో ఇక టెలివిజన్ లో కూడా సినిమా టెలికాస్ట్ అయితే మంచి రేటింగ్ లను సొంతం చేసుకోవడం…

ఖాయమని భావించినప్పటికీ సినిమా టెలివిజన్ లో రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి ఒకింత షాక్ ఇచ్చే రేటింగ్ నే సాధించింది, సినిమాను మొత్తం మీద జీ 5 వాళ్ళు 3.5 కోట్ల రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకోగా అందులో డిజిటల్ రైట్స్ 2 కోట్లు అని… టెలివిజన్ రైట్స్ 1.5 కోట్ల దాకా ఉంటుందని సమాచారం.

ఇక సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన మొదటి సారి మొత్తం మీద 3.03 రేటింగ్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది, హిలేరియస్ ఎంటర్ టైనర్ అవ్వడం తో కచ్చితంగా మంచి రేటింగ్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అని అంతా భావించారు కానీ రేటింగ్ మాత్రం నిరాశ పరిచే విధంగా వచ్చింది అని చెప్పాలి, కానీ సినిమా టెలివిజన్ బిజినెస్ రేటు ప్రకారం చూసుకుంటే…

పర్వాలేదు అనిపించే రేటింగ్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి, సినిమాను మరింత పబ్లిసిటీ లాంటివి చేసి అప్పుడు టెలికాస్ట్ చేసి ఉంటె కచ్చితంగా సినిమా మరింత బెటర్ రేటింగ్ ను సాధించి ఉండేది, ఇక రిపీట్ టెలికాస్ట్ లో సినిమా ఎంతవరకు జోరు చూపుతుంది అన్నది ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here