బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అన్ని చోట్లా వీకెండ్ లో వీర లెవల్ లో వీరంగం సృష్టించింది. అనుకున్న అంచనాలను ప్రతీ రోజూ మించి పోయి కుమ్మేసిన సినిమా…
మూడో రోజు అయితే నైట్ షోలకు డ్రాప్స్ ఉంటాయి అనుకున్నా కూడా నైజాంలో బిగ్గెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. వైజాగ్ లో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించిన సినిమా ఓవరాల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 7.5-8 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని అనుకున్నా కూడా…
ఈ అంచనాలను సైతం మించి పోయిన సినిమా మూడో రోజు ఏకంగా 8.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మూడో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ తో రికార్డ్ కొట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరు చూపించిన సినిమా 10.08 కోట్ల రేంజ్ లో షేర్ ని 17.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Thandel Movie 3 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 10.45Cr
👉Ceeded: 3.35Cr
👉UA: 3.31Cr
👉East: 1.89Cr
👉West: 1.42Cr
👉Guntur: 1.56Cr
👉Krishna: 1.48Cr
👉Nellore: 90L
AP-TG Total:- 24.36CR(39.40CR~ Gross)
👉KA+ROI: 2.68Cr
👉OS – 3.70Cr****approx
Total WW Collections: 30.74CR(Gross- 54.15CR~)
(81%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 81% రేంజ్ లో రికవరీని మూడు రోజుల్లోనే అందుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 7.3 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తుందో చూడాలి.