Home న్యూస్ 3 డేస్ లో 390 కోట్లు….రెబల్ స్టార్ దెబ్బకి రికార్డులు గల్లంతు!!

3 డేస్ లో 390 కోట్లు….రెబల్ స్టార్ దెబ్బకి రికార్డులు గల్లంతు!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాల్లో 101.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 279.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో రచ్చ లేపగా…

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ తో 32-34 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి..ఇక హిందీలో సినిమా ఈ రోజు 34-35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ కేరళ ఏరియాల్లో మంచి జోరు ని చూపిస్తూ 15 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో సినిమా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో దూసుకు పోతూ ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 22-24 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా 3వ రోజు ఇండియాలో సినిమా 83-85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 108-110 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా కొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా…. ఈ రోజు కలెక్షన్స్ తో 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సినిమా 135 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 390 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం కనిపిస్తుంది.. సెన్సేషనల్ రికార్డులతో 3 నెలల అన్ సీజన్ కి మాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తున్న కల్కి మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 3 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలానే ఉంటాయా కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here