Home న్యూస్ ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ రికార్డ్ ఉన్న ఒకే ఒక్క సౌత్ హీరో రెబల్ స్టార్!

ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ రికార్డ్ ఉన్న ఒకే ఒక్క సౌత్ హీరో రెబల్ స్టార్!

0

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ రేంజ్ తక్కువే….అమెరికా మనకు పెద్ద మార్కెట్ అయితే తర్వాత పెద్ద మార్కెట్ ఆస్ట్రేలియా… మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే ఈ ప్లేసులలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది… ఆస్ట్రేలియాలో ఇది వరకు మార్కెట్ అంతగా లేదు కానీ ఇప్పుడిప్పుడే మంచి మార్కెట్ ఏర్పడుతుంది…

అలాంటి ఈ ఏరియాలో ఇప్పుడు టోటల్ సౌత్ ఇండియా మూవీస్ పరంగా ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) తో సొంతం చేసుకున్నాడు… రీసెంట్ టైంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్…

అన్ని సినిమాలతో సంచలనం సృష్టిస్తూ ఉండగా ఒక్క రాదే శ్యామ్ మాత్రమే తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కల్కి మూవీ రీసెంట్ గా ఇక్కడ రిలీజ్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా వీకెండ్ కూడా కంప్లీట్ అవ్వకముందే అక్కడ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…

   

మొత్తం మీద ప్రభాస్ కెరీర్ లో ఆస్ట్రేలియా గడ్డ మీద 5 సినిమాలు 1 మిలియన్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ నుండి ఏ హీరో అలాగే సౌత్ ఇండస్ట్రీ నుండి ఏ హీరో కూడా ప్రభాస్ నెలకొల్పిన ఈ రికార్డ్ ను అందుకోలేనంత జోరుతో దుమ్ము లేపుతున్నాడు ఇప్పుడు…

సినిమా అక్కడ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగా లాంగ్ వీకెండ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అదే టైంలో టోటల్ ఓవర్సీస్ లో కూడా సినిమా ఉన్న క్రేజ్ కి ఫుల్ న్యాయం చేసే రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here